Water Lifting From Yellampalli Project : యాసంగిలో సాగునీరు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్‌లోనూ అనుకున్నంత మేర వానలు కురవక అన్నదాతల్లో అయోమయం నెలకొంది. తాజాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఎత్తిపోతలు చేపట్టడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.