Godavari Water Level At Bhadrachalam Today : గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం పరివాహక ప్రాంతంలో గోదావరి ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. అంతకంతకూ పెరుగుతూ అప్పుడే మళ్లీ తగ్గుతోంది. శనివారం రాత్రి 53.8 అడుగులు చేరిన గోదావరి నీటిమట్టం, రాత్రి 9 గంటల నుంచి తగ్గుతూ వస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53.2 అడుగుల వద్దకు చేరుకుంది. 10 గంటల సమయానికి నీటిమట్టం 52.1 అడుగులుగా నమోదైంది.