Turkapally Road accident video : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లి - మజీద్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇన్నోవా కారు హైదరాబాద్ వైపు మీతిమీరిన వేగంతో వస్తూ అదుపుతప్పి డివైడర్ పై నుంచి ఎగిరి మరోవైపు రహదారిపై పడింది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మృతులు హకీంపేట్ కు చెందిన శేఖర్ మోహన్ వాలే, మౌలాలి ప్రాంతానికి చెందిన మలావత్ దీపికగా పోలీసులు గుర్తించారు.