Madanapalle Sub Collectorate Fire Accident Case: మదనపల్లె ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. ఫైళ్ల కాల్చివేత ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ నేత మాధవరెడ్డి కోసం గాలిస్తూనే స్థానిక వైసీపీ నేతలను కొందరిని అదుపులోకి తీసుకొన్నారు. మదనపల్లె పురపాలక వైస్ ఛైర్మన్ జింకా చలపతిని విచారిస్తున్నారు. మాధవరెడ్డి కాల్‌డేటా అధారంగా వైసీపీకి చెందిన కీలక నేతలపై పోలీసులు నిఘా పెట్టారు.