Union Budget Debate in TG Assembly : రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, పాలకపక్ష నేతగా తాను వస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా తాను సిద్ధమని, సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలన్నారు.