MAA Association Warning to YouTubers and Trollers : ఇన్ఫ్ల్యూయెనర్స్, మీమర్స్, యూట్యూబర్స్కు ఇది చేదువార్త. ఇకపై నటీనటుల వ్యక్తిగత జీవితాల పట్ల తప్పుగా వీడియోలు ట్రోల్స్ చేస్తే కటకటాలు లెక్కపెట్టాల్సిందే. ఆ దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిద్ధమైంది. ఇప్పటికే 25 యూట్యూబ్ ఛానల్స్‌ను పూర్తిగా టెర్మినేట్ చేయించిన మా అసోసియేషన్, మరో 200కు పైగా ఛానల్స్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా యూట్యూబర్స్, ట్రోలర్స్‌పై మా అసోసియేషన్ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. మా సభ్యులు సీనియర్ నటులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.