Only One Teacher and 100 Students : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని పాఠశాలకు అవసరం ఉన్నా ఉపాధ్యాయుడిని కేటాయించకపోవడం. మరి కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కేటాయింపులు చేయడం జరిగింది. అయితే, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులో ఉపాధ్యాడి కోసం ఎదురు చూసిన విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. వంద మంది విద్యార్థులున్న స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడంతో విద్యార్థుల విద్యపై పెనుప్రభావం పడుతుంది.