వసూళ్ల రజనీ ముఠా దందాలు - కోట్లు వసూలు చేశారుగా!

ETVBHARAT 2024-06-28

Views 167

Former Minister Vidadala Rajini Illegal Corruptions in AP: ఏపీలోని పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ.12 లక్షలు పలుకుతోంది. ఐతే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు రూ.31 లక్షలు ఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజిని రైతులకు ఎరేశారు. ఐతే అందులో కొంత కమిషన్‌ కోరుకున్నారు. మధ్యవర్తులుగా కొందరిని పంపారు.

మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1.16 కోట్ల రైతుల నుంచి వసూలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS