Andhra Pradesh: Center Good News for Jagan Govt, Releases rs 10,467 cr as 2014-15 Revenue Deficit for AP Govt.
ఏపీలో ఉన్న ఆర్దిక కష్టాల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం జగన్ కి గుడ్ న్యూస్ అయింది. 2014- 15 ఆర్దిక సంవత్సరం నాటి రెవిన్యూ లోటు కింద రూ 10,460.87 కోట్లు విడుదలకు నిర్ణయించింది కేంద్రం. ఈ నిధులను వెంటనే ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ రెవిన్యూ లోటు కోసం చంద్రబాబు ప్రభుత్వం 2014-19 వరకు ఎన్నోసార్లు కేంద్రాన్ని అభ్యర్ధించింది. ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం పైన ప్రధాని మోదీని కలిసి నిధులు విడుదలకు సహకరించాలని కోరారు. దీంతో ప్రధాని కార్యాలయ ఆమోదంతో నిధులు మంజూరయ్యాయి.
#apcmjagan #APElections2024 #TDP #APgovt #chandrababunaidu #YSRCP #pmmodi
~ED.42~PR.41~