Women often suffer from illness at home. Vastu Shastra experts say that womens health will be affected only if these Vastu Defects | అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు, చాలామందికి తినడానికి ఆహారం, ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా ఎప్పుడు అనారోగ్యం వెన్నంటే ఉంటుంది. అది ఆ కుటుంబంలో తీవ్రమైన అశాంతికి, అలజడికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు ఎప్పుడూ జబ్బు పడుతున్నారు అంటే ఆ ఇంట్లో ఎవరికి సుఖశాంతులు ఉండవు. ఎంత డబ్బు సంపాదించినా ఆసుపత్రుల కోసమే వృధాగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇక సదరు గృహిణి కూడా శాశ్వతంగా ఒకే అనారోగ్య సమస్యతో బాధపడరు . రకరకాల అనారోగ్య సమస్యలతో, ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు నియమాలు సరిగా పాటించకపోవటం వల్ల అని చెప్తున్నారు.
#VastuTips
#National
#Telangana
#AndhraPradesh
#VastuTips
#WealthAndProsperty