Former YSRCP minister kodali nani on today made key comments on amaravati farmers | గుడివాడ 17వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని అన్నారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని, అమరావతి రైతులు మాత్రం తామే బాగుండాలని విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.
#AmaravatiFarmers
#YSRCP
#KodaliNani
#TDP
#AndhraPradesh
#ChandraBabuNaidu