TDP Chief Chandra Babu jumps on Canal barrears in Palnadu tour photo became viral in TDP Circles | టీడీపీ అధినేత చంద్రబాబు ఫిట్ నెస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. రాజకీయంగా దూకుడుగా కనిపిస్తున్న చంద్రబాబు వయసు - ఆరోగ్యం పైన మరోసారి చర్చ మొదలైంది. 72 ఏళ్ల వయసులో చంద్రబాబు ముందుకు దూకుతూ పొలాల మధ్య గట్లను అలవోకగా దాటిన ఫొటోలు..వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. భారీ వర్షాలతో దెబ్బ తిన్న రైతులను పరామర్శించారు. వారి పొలాలను సందర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు ఓ కాలువను దాటాల్సి వచ్చింది.
#TDP
#ChandraBabuNaidu
#Palnadu
#ViralVideos
#ChandrababuFitness
#AndhraPradesh