Etela Rajender said that if anything happens to us, KCR is responsible. Etela alleges huge gun licenses given in huzurabad | తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని, తనకు గాని, తన కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. నాది కాని, నా కుటుంబ సభ్యులది కానీ ఒక్క రక్తపు బొట్టు కారినా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కెసిఆర్ ని ఓడించేంతవరకు తాను నిద్ర పోనంటూ ఈటల రాజేందర్ శపథం చేశారు.
#EtalaRajender
#CMkcr
#Huzuraba
#TRS
#BJP
#Telangana
#National