gautam gambhir says i don't think anyone would have survived for this long over virat kohlis century | సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 1,025 రోజుల తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అది కూడా తన ఆటకు ఏమాత్రం సూటవ్వని ఫార్మాట్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న టీ20ల్లో శతకం బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌కు ఇది మొదటి సెంచరీ కాగా మూడు ఫార్మాట్లలో కలిపి 71వ శతకం. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఆసియా కప్ ముందు వరకు విరాట్ ఫామ్‌కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు.
#viratkohli
#asiacup2022
#gambhir