BJP Suspends Raja Singh | భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అసెంబ్లీలో బీజేపీ సభా పక్షనేతగా వ్యవహరిస్తోన్న ఆయనను ఆ పదవి నుంచి కూడా తప్పించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ చేయడానికి గల కారణాలను కూడా వివరించింది బీజేపీ హైకమాండ్. అలాగే- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను 10 రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.
#RajaSingh
#Bjp
#Telangana