ISRO launched its new Small Satellite Launch Vehicle (SSLV) from the Satish Dhawan Space Centre (SDSC) in Sriharikota on August 07. And SSLV also have a co-passenger satellite called ‘AzaadiSAT’ comprising 75 payloads built by 750 young girl students from 75 rural government schools across India | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతోంది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1) నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ వంతు మొదలైంది. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఆజాదీకా మహోత్సవ్ వేళ విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా ప్రయోగాన్ని డిజైన్ చేశారు.'ఆజాదీ కా అమృత్' మహోత్సవ్‌లో భాగంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఈ 'ఆజాదీశాట్' అభివృద్ధిలో దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది చొప్పున మొత్తం 750 బాలికలు ఈ శాటిలైట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
#ISRO
#SSLVrocket
#AzaadiSAT
#Sriharikota
#EOS02
#AzaadiKaAmritMahotsav
#PSLV