Will Galla Family stay In Politics for Upcoming Elections? TDP Cheif Chandrababu Naidu Confusion About Galla Jayadev | ఎంపీగా పోటీచేయాలంటే అంగబలం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు అవసరం. అటువంటివారు దొరకడం అన్ని పార్టీలకు కష్టమవుతోంది. తనతోపాటు నియోజకవర్గ పరిధిలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలున్నాయి. వీరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎంపీపై ఉంటుంది. ఎంపీ స్థానాల్లో పోటీచేయడానికి బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే వేట ప్రారంభించిన టీడీపీ అధినాయకత్వానికి గుంటూరు విషయం డైలామాలో పడేసింది.
#Chandrababunaidu
#TDP
#Gallajayadev