Gold Demand Falling globally but Gold Rates rising in India According to World Gold Council Reports
#GoldPrice
#GolddemandinIndia
#jewelry
గత కొన్ని నెలలుగా బంగారం కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ మూడు వారాలుగా రేటు క్రమంగా పెరగటం ప్రారంభించింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో దేశంలో బంగారం డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 43 శాతం ఎక్కువగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో వెల్లడించింది . ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో బంగారం డిమాండ్ 170.7 టన్నులుగా ఉంది. ఇది 2021 అదే కాలంలో ఉన్న 119.6 టన్నుల డిమాండ్ కంటే దాదాపుగా 43 శాతం ఎక్కువని తేలింది.