Kuppam అభ్యర్థిగా భరత్ కే సీటు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పలమనేరు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో కుప్పం నుంచి విశాల్ పోటీ చేస్తున్నారన్న వార్తలపై పెద్దిరెడ్డి స్పందించారు. సినీ నటుడి పోటీపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్న పెద్దిరెడ్డి ఇప్పటికే ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ భరత్ కే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉందన్నారు.