కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటరాక్షన్ పేరుతో 11 మంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారన్న విషయం వెలుగు చూసింది. పెట్రో కెమికల్ డిపార్ట్ మెంట్ లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కు చెందిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కు చెందిన విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితుడు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ కు ఫిర్యాదు చేశాడు.