సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో అనుమానితుడిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు నివాసంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అకాడమీలో రికార్డులు, డాక్యుమెంట్లు తనిఖీలు చేస్తున్న అధికారులు....కంప్యూటర్లు,బ్యాంక్ స్టేట్ మెంట్లు, ల్యాప్ ట్యాప్ ల నుండి సమాచారం సేకరించారు. తనిఖీలపై సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.