Anakapalli Disrtrict Narsipatnam హై టెన్షన్ నెలకొంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చేశారు మున్సిపల్ అధికారులు. రెండు సెంట్లు అక్రమించుకున్నారని ఆరోపిస్తూ నోటిసు ఇచ్చారు అధికారులు. అయ్యన్న ఇంటి సమీపంలో బారికేడ్లు వేసి పెద్ద సంఖ్యలో పోలీసు పహారా కాస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.