Agnipath విషయంలో ఆందోళనలు అర్థం లేనివని Loksatta జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. కొత్త విధానంలో మంచి చెడులను పరిశీలించకుండా.. గుడ్డిగా వ్యతిరేకించడం సబబు కాదన్నారు. సైనిక దళాల వ్యయం మొత్తం జీత, భత్యాలకు.. ఎక్కువుగా ఖర్చు అవుతోందని ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం సాధ్యం కావడం లేదన్నారు. అగ్నిపథ్ విషయంలో అవగాహన లేకనే ఆందోళనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొట్టడం సరైన చర్య కాదన్నారు.