బాసర ట్రిపుల్ ఐటీలో మూడో రోజూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు నిరసనలు విరమించేది లేదని తేల్చిచెప్తున్నారు. తమ సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం సరైనది కాదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ గేట్ వద్ద విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.