మంగళగిరి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ను కూల్చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతులు లేవంటూ అన్న క్యాంటీన్ ను అధికారులు కూల్చేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించినా పోలీసులు వారిని పక్కకు లాగేసి క్యాంటీన్ కూలదోశారు. క్యాంటీన్ కూల్చివేతపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నోటి దగ్గరి కూడును లాక్కునే ప్రయత్నంగా క్యాంటీన్ కూల్చివేతను పేర్కొన్నారు లోకేష్.