నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 28 మంది అభ్యర్థులు 38 నామినేషన్లు దాఖలు చేయగా...13 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వీటిలో కొన్ని సంతకాల విషయంలో అధికారులను మోసగించే ప్రయత్నం జరిగిందని అలాంటి నామినేషన్లు తిరస్కరించామని అధికారులు తెలిపారు.