టీడీపీ నేత బుద్దావెంకన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడులో జాలయ్య మృతిని ఖండించిన వెంకన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయల్దేరారు. అయితే వెంకన్న పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలను వెంకన్న ఖండించారు. సీఎం హత్యలు చేయమని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. పల్నాడు హత్యకు పిన్నెల్లి సూత్రధారిగా వ్యవహించారని ఆరోపించారు బుద్దా వెంకన్న