AP Govt got 1.25 lakhs MOUs in DAvos world economic forum meetings, CM Jagan met industrial gaints in this tour.
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ భవిష్యత్ కు సంబంధించి కీలక అడుగులు పడినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా మంత్రులు..అధికారులు దావోస్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. పలు అంతర్జాతీయ సంస్థల ముఖ్యులు..ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ పర్యటన ద్వారా అదానీ, గ్రీన్‌కో, అరబిందో సంస్థలతో.. లక్షా 25 వేల కోట్ల రూపాయల మేర ఎంవోయూలు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ సెజ్ తో పాటుగా హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.
#Davos
#Andhrapradesh
#CMYsjagan