డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వరంగల్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టుబడ్డ వ్యక్తిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అనంతరం ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా ‘నేను డాక్టర్ భార్గవ్’ అంటూ డ్యూటీలో ఉన్న వారికి చుక్కలు చూపించాడు. మెడికల్ టెస్టులకు సహకరించకపోగా, డైరెక్ట్‌గా డాక్టర్ కుర్చీలో కూర్చొని ‘నన్నే ఆపుతారా’ అంటూ గొడవకు దిగాడు.