తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.