అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య రగడ మొదలైంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథ్ రెడ్డికి కేటాయిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు పల్లె రఘునాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జేసీ పార్టీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.