చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలంరేపింది. చంద్రగిరి మండలం పనపాకంకు చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేష్ ఆచారి తన ఇంటి పక్కనే కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు స్థానిక నాయకులే ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల హామీతో గ్రామంలో రోడ్డు పనులకు చేస్తే రూ.6 లక్షలు అప్పులు మిగిలాయని.. మండల, రెవెన్యూ, పోలీసులు అధికారుల కార్యాలయాల చుట్టూ ఏడాది పాటు తిరిగిన ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు అధికారులు, కొందరు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలే అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సెల్ఫీ వీడియో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. బాధితుడు వెంకటేష్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు. వెంకటేష్ ఆరోపణలపై అధికారులు స్పందించాల్సి ఉంది.