తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.. ‘రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైంది.. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల పాఠశాలలు బలోపేతమవుతాయని కేసీఆర్ ప్రకటించారు.. కానీ, సరైన వసతులే లేవు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను వెంటనే పూర్తి చేయాలి. మన ఊరు మన బడి కార్యక్రమన్ని స్వాగతిస్తున్నాం.. వచ్చే విద్యా సంవత్సరంలోపు టీచర్ ఎలిజిబుల్ పరీక్ష నిర్వహించాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు.