Ricky Ponting Questions Joe Root Captaincy.
#Rickyponting
#Ashes2021
#JoeRoot
#AusvsEng
ఆడిలైడ్ టెస్టులో ఓటమి పాలైన అనంతరం తమ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శల వర్షం కురిపించాడు. నీవు కెప్టెన్‌గా ఎందుకున్నావంటూ నిలదీశాడు. అసలు ఏం జరిగిందంటే.. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమైన ఇంగ్లండ్ జట్టు అతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 275 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది