తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌కి చెందిన నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి కార్మికుల ఆందోళనకు అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రత్యక్ష ఆందోళనలకు కూడా సిద్ధమయ్యాయి. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మెదీకి లేఖ రాశారు. బొగ్గు బ్లాకులను వేలం వేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.