Twitterverse Has Come Out in Support of Shoaib Akhtar After Ugly Spat With PTVC Director Nauman Niaz
#t20worldcup2021
#ShoaibAkhtar
#Naumanniaz
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ షోలో ఘోర అవమానం జరిగింది. పాక్ ప్రభుత్వ యాజమాన్య కనుసన్నల్లో నడుస్తున్న పీటీవీ స్పోర్ట్స్‌లో క్రికెట్ చర్చ జరుగుతుండగా.. సెట్ నుంచి వెళ్లిపోవాలని షో హోస్ట్ చెప్పాడు. ఊహించని పరిణామం ఎదురుకావడంతో అక్తర్ వెంటనే తాను ధరించిన మైక్రో ఫోన్‌ను పక్కన పెట్టేసి బయటికి వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ ఛానెల్‌తో విశ్లేషకుడిగా ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ అవమానంతో క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగనని పాక్ మాజీ పేసర్ స్పష్టం చేశాడు. ఇక పీటీవీ షో నిర్వాహకుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజెన్లు మండిపడుతున్నారు.