T20 World Cup: New Zealand's Martin Guptill doubtful for India clash
#MartinGuptill
#Teamindia
#KaneWilliamson
#IndVsNz
#T20WORLDCUP2021
టీ20 ప్రపంచకప్ 2021 టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ మెగా టోర్నీ దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్‌కు గాయం అయింది. మంగళవారం షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కాలి బొటన వేలికి గాయం అయింది. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని సమాచారం తెలుస్తోంది. దీంతో అతడు ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఆడకపోవచ్చని తెలుస్తుంది. ఇదే జరిగితే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగలనుంది.