Ireland's Simi Singh, first cricketer to score ODI century batting at No 8, has India connect
#Simisingh
#Ireland
#SouthAfricavsIreland
#India
#Savsire
సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అజేయ సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్ మనోడే. అవును వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎనిమిది లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఘనత వహించిన ఈ సిమీ సింగ్ మన భారతీయుడే. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన సిమ్రన్ జిత్ సింగే ఈ సిమి సింగ్. క్రికెట్‌లో తనకు ఎదుగుదల లేదనే అసహనంతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసేందుకు 2005లో సిమ్రన్ జిత్ సింగ్ ఐర్లాండ్ వెళ్లాడు. దేశం మారినా.. క్రికెట్‌పై తనకున్న అభిరుచి మాత్రం మారలేదు. చదువుతో పాటు క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకొని.. డబ్లిన్‌లోని మలాహిడ్ క్రికెట్ క్లబ్లో చేరాడు. అక్కడ ప్లేయర్‌గా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అక్కడే అతని దశ తిరిగింది.