Sri Lanka vs India three-match ODI series starts with the first ODI on Sunday, July 18. The match is scheduled to take place at R. Premadasa Stadium in Colombo, Sri Lanka.
#INDVSSL1stODI
#SriLankavsIndiaLiveScore
#WeatherForecast
#RPremadasaStadium
#ShikharDhawan
#DasunShanaka
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, శ్రీలంక సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. హోమ్ టీమ్‌లో కరోనా కేసులు వెలుగు చూడటంతో.. ఐదు రోజులు ఆలస్యంగా ఈ సిరీస్‌ను మొదలుపెడుతున్నారు. దీంతో ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య నేడు( ఆదివారం) జరిగే ఫస్ట్ వన్డేతో సిరీస్‌కు తెరలేవనుంది.అయితే ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉండటమే అభిమానులను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కురవడానికి 20 శాతం అవకాశం ఉందని లంక వాతవారణ శాఖ అంచనా వేసింది. కొలంబోలో ఉక్కపోత వాతవారణం నెలకొందని, సగటు ఉష్ణోగ్రత 29 డిగ్రీస్ సెల్సియస్‌గా నమోదైందని పేర్కొంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు జరిగే నష్టం పెద్దగా ఉండదని తెలిపింది. కానీ వర్షం అంతరాయం కలిగిస్తే ఫలితంపై ప్రభావం ఉంటుందని అభిమానులు కలవరపడుతున్నారు.