Hyderabad boy with rare disorder get world's costliest drug as parents raise ₹16 crore. Zolgensma, labelled as the "world''s most expensive drug," was imported from the US with the donations and administered to little Ayaansh Gupta on Wednesday, at a private hospital in the city.
#ViratKohli
#worldsmostexpensivedrug
#Virushka
#ImpactGuruCrowdfunding
#Zolgensma
#WorldsExpensiveMedicine
#AyaanshGupta
#HyderabadBoy
#AnushkaSharma
పుట్టకతోనే అతి క్లిష్టమైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ(ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న బాలున్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా 62, 400 మంది దాతలు చేయూతను అందించారు. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ సైతం పాలుపంచుకున్నారు. ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్‌లైన్ వేదికగా గత ఏడాది కాలంగా క్రౌడ్ ఫండింగ్ నిర్వహించి రూ.16 కోట్లు సమకూర్చింది.ఈ క్రౌడ్ ఫండింగ్‌లో తమ వంతు సాయం ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు బాలుడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గత నెల 24నే ట్వీట్ చేశారు. ‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. మీ అభిమానులుగా మేం ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాం. కానీ మీరు అయాన్ష్ కోసం మేం ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారు.మీ ఔదార్యానికి ధన్యవాదాలు. మా జీవితంలోనే ఈ కఠినమైన మ్యాచ్‌ను సిక్స్‌తో గెలవడానికి మీరు సాయం చేశారు. మీ సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.'అని పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎంత సాయం చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ భారీ మొత్తంలోనే సాయం చేసినట్లు చిన్నారి తల్లిదండ్రుల ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది.