#Corona: Most of country should remain locked down for 6-8 weeks to curb Covid spread: ICMR chief
#Lockdown
#COVID19
#ICMR
#CoronaRecovery
#GandhiHospital
#ICMRchief
#Covidspread
#COVIDvaccination
#IndiaLockdown
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారి విజృంభిస్తున్న వేళ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) కీలక సూచనలు చేసింది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 6 నుంచి 8 వారాలపాటు లాక్‌డౌన్ అవసరమని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉండాల్సిందేనని అన్నారు. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు తగ్గించవచ్చని సూచించారు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్ అవసరమని పేర్కొన్నారు.