Hardik Pandya and Shikhar Dhawan in contention for India captaincy on Sri Lanka tour
#Dhawan
#Iyer
#Teamindia
#Indvssl
#Indvseng
#IndvsNz
#WTCFinal
జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తప్పుకున్నాడు. లంక పర్యటన కోసం జట్టుని ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమవుతుండగా.. శ్రేయాస్ సెలక్షన్‌కి అందుబాటులో ఉండటం లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. మరోవైపు గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.