Rescue workers reached Reni village in Chamoli district of Uttarakhand | Oneindia Telugu

Oneindia Telugu 2021-02-08

Views 1.4K

Rescue workers reached Reni village in Chamoli district of Uttarakhand on Feb 07. Water level rose in Dhauliganga River following an avalanche. Rishiganga Power Project has been damaged due to Break of a glacier in Tapovan area, informed Chamoli Police. Directions have been issued to evacuate people living on the bank of Dhauliganga River.

#Chamoli​
#Uttarakhand​glacierBreaks
#UttarakhandDisaster​
#TapovansDhauliganga
#RishigangaPowerProject
#ITBP​
#Glacier​
#DhauligangaRiver​
#Rescue​operations
#ReniVillage​
#SDRF
#Mandakiniriver
#ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మంది కార్మికులు, ప్రజలు ధౌలిగంగా, అలకనంద నదీ ప్రవాహంలో గల్లంతైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించారు. కొందరిని ప్రాణాలతో కాపాడగలిగారు. తపోవన్ ప్రాంతం మొత్తం మట్టి దిబ్బగా మారింది. బురదలో పేరుకుపోవడం వల్ల గల్లంతైన వారిని గాలించడం కష్టతరమౌతోందని చమోలీ జిల్లా పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి. వరద నీటి ప్రవాహానికి పలు నివాసాలు కొట్టుకెళ్లాయి. నందా దేవి జాతీయ పార్క్‌లో మంచు చరియలు విరిగి పడటం వల్ల ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది.

Share This Video


Download

  
Report form