Top News Of The Day: Union Education Minister, Dr. Ramesh Pokhriyal Nishank had announced the date of CBSE 10th and 12th board exams. The examinations will be conducted from May 4 to June 10. The Union Education Minister, through a webinar held last year, had announced that CBSE 10 and 12 results will be announced by 15th July. The US Capitol was shut down temporarily on Monday days before President-elect Joe Biden's inauguration. Telangana Government has opposed Jagan government's plans to shift Krishna River Board from Vijayawada to Vizag.
#CBSEBoardExam2021
#KrishnaRiverBoard
#JoeBidenInauguration
#COVID19Vaccination
#USCapitol
#CMKCR
#apcmjagan
#aptemplesissue
#CoronaVaccination
#Telangana
#KrishnaRiverBoardfromVijayawadatoVizag
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#UnionEducationMinisterDrRameshPokhriyalNishank
#AndhraPradesh
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలు తగ్గించిన సిలబస్‌తోనే ఉంటాయని స్పష్టంచేశారు. సోమవారం కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర జల జగడాలు ఉన్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విషయంలోనూ తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు చెబుతోంది. ఇదే క్రమంలో మరో జగడం కూడా వచ్చి చేరింది. గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించిన కృష్ణా నదీ బోర్డు కార్యాలయాన్ని ఇప్పుడు వైసీపీ సర్కారు కొత్త రాజధాని విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏడాది క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. కానీ ఆ తర్వాత వైసీపీ సర్కారు మా రాజధాని విజయవాడ కాదు విశాఖ కాబట్టి ఈసారి అక్కడికి తరలించాలని కోరుతోంది. గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు కృష్ణాబోర్డు తరలింపును స్వాగతించిన వారంతా ఇప్పుడు విశాఖకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తప్పుబడుతున్నారు. అఠు కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. గతంలో విజయవాడకూ, కృష్ణానదికి ఉన్న అవినాభావ సంబంధం ఆధారంగా హైదరాబాద్ నుంచి మార్చేందుకు ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు సంబంధంలేని విశాఖకు ఎలా తరలిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల విషయంలో కలిసి కూర్చుని చర్చించుకుందామని ప్రతిపాదించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా రివర్స్ అవుతున్నారు. అటు తెలంగాణల విపక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులంటూ ఏపీలో నిర్మాణాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కేసీఆర్... ఇప్పుడు కృష్ణాబోర్డు కార్యాలయం తరలింపునూ వ్యతిరేకిస్తున్నారు.