Odisha: PuriJagannath Temple reopens, Puri sheds tears of joy
#Odisha
#Bhubaneswar
#PuriJagannathTemple
#Covid19
కరోనా వైరస్ తో 9 నెలల విరామం తర్వాత పూరిలోని జగన్నాథ్ ఆలయం భక్తుల సందర్శనార్థం బుధవారం తిరిగి తెరుచుకుంది. భక్తుల మతసంబంధ విశ్వాసాల క్రమంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాన్ని తెరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. మొదట కొన్ని రోజులపాటు పూరీ స్థానికులకే దర్శనం సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని అధిక సంఖ్యలో వచ్చే రష్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2 వ తేదీల్లో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి భక్తులందరిని దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భక్తులు కరోనా రూల్స్ ను కచ్చితంగా పాటిస్తూ ఆలయానికి రావాల్సిందిగా తెలిపారు.