Australian former Cricketer, Commentator Dean Jones is no more
#Deanjones
#CricketAustralia
#Ipl2020
#ViratKohli
#Mumbai
: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ లెజెండ్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ మృతి చెందారు. ఆయన వయసు 59. జోన్స్ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. డీన్ జోన్స్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ బృందంతో కలిసి పనిచేస్తున్నారు. ముంబైలోని సెవెన్ స్టార్ హోటల్‌లో బయో బబుల్‌లో ఉన్నారు. డీన్ జోన్స్ మంచి క్రికెట్ విశ్లేషకులు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 పై ఆఫ్-ట్యూబ్ వ్యాఖ్యానం చేయడానికి ఒప్పందం చేశారు.