Watch Ganesh Immersion Arrangements at Tankbund . Hyderabad city police on Monday issued traffic restrictions to be imposed in the city on the occasion of Ganesh idol immersions.
#GaneshNimajjanam
#KhairatabadGaneshImmersion2020
#Ganeshidolimmersions
#KhairatabadGaneshImmersionTankBund
#trafficrestrictions
#GaneshImmersionInHyderabad
#Hyderabadcitypolice
#గణేష్ నిమజ్జనోత్సవం 2020
నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గణేశ్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఇప్పటికే భాగ్యనగరంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత ఏడాదితో పోల్చితే తక్కువే అయినప్పటికీ... ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనం కన్నుల పండుగ చేయనుంది. భక్తులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని పోలీసులు సూచించారు. జంట నగరాల నుంచి ట్యాంక్‌బండ్‌కి వినాయకుల తరలింపు నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం 9గం. నుంచి బుధవారం ఉదయం 8 గం.వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలతో వెళ్లే వాహనా లకు మాత్రమే ప్రధాన రహదారులపై అనుమతి ఉంటుంది. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే పశ్చిమం నుంచి తూర్పుకు రెండు వైపులా వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు నేపథ్యంలో వాహనదారులు రింగ్‌రోడ్డు, బేగంపేట రోడ్ల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. జేబీఎస్,ఎంజీబీఎస్‌ల నుంచి రాకపోకలు సాగించే బస్సులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.