ముంబైకి చెందిన ప్రముఖ ఎనర్జీ కంపెనీ సంస్థ ఆర్ఆర్ గ్లోబల్ భారత ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆర్ఆర్ గ్లోబల్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ బ్రాండ్ 'బిగాస్' (BGauss) ఇప్పుడు భారత్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది.
బిగాస్ ఇండియా మార్కెట్ కోసం తన మొదటి రెండు ఉత్పత్తులను ఐదు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఇవి లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ విభాగాలలో ఆగస్టు మొదటి వారం నుండి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.