బజాజ్ ఆటో ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' కోసం ఇప్పుడు తిరిగి బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసిన బజాజ్ ఇప్పుడు తిరిగి బుకింగ్స్ ఓపెన్ చేసింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. త్వరలోనే ఈ స్కూటర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2020 జనవరిలో బజాజ్ ఆటో తమ ఐకానిక్ చేతక్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ కేవలం బెంగుళూరు మరియు పూనే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.