David Warner & Wife Candice Dance To Telugu Hit Song 'Butta Bomma'

Oneindia Telugu 2020-04-30

Views 585

Warner, who has been significantly active on social media, posted a video of him dancing with wife Candice to the tunes of a Telugu song.
#DavidWarner
#TikTokvideos
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia

కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో అందరూ ఆటగాళ్లతో సహా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఈ మధ్యే టిక్ టాక్ లో చేరిన వార్నర్ ఇంతక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్ సూపర్ హిట్ సాంగ్ 'షీలా కీ జవానీ'కి వార్నర్‌ స్టెప్పులు ఇరగదీశాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ పాటకు కూడా అదే తరహాలో అభిమానులను అలరించాడు. తాజాగా 'అల.. వైకుంఠపురములో..' చిత్రంలోని సూపర్‌ హిట్‌ బుట్ట బొమ్మ సాంగ్‌కు క్యాండిస్‌తో కలిసి వార్నర్‌ చిందేశారు. ఈ పాటలోని సిగ్నచర్ స్టెప్ ను వార్నర్, క్యాండీస్ కలసి చేశారు.. ఇక తన పాటకు డాన్స్ చేసినందుకు అల్లు అర్జున్.. వార్నర్ కు థాంక్స్ చెప్పాడు.ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో.. వార్నర్‌ సన్‌రైజర్స్‌ టీ షర్ట్‌ ధరించారు. వార్నర్‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది.

Share This Video


Download

  
Report form